ఒరాకిల్‌ నుంచి స‘రాగాల’ దాకా...

సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం.. ఐదంకెల జీతం.. అయినా ఇవేవీ ఆమెకు సంతృప్తినివ్వలేదు. సంగీతంపైనే మనసు మళ్లింది. పదేళ్లపాటు ఉద్యోగం చేస్తూనే వీకెండ్‌లో సంగీత ప్రదర్శనలిచ్చింది. అయితే కొద్ది సంవత్సరాల తరువాత ఆమెకు జాబ్‌ బోర్‌ కొట్టేసింది.సంగీతమే తన ప్రపంచం అనుకుంది.  ఉద్యోగం మానేసి సంగీతప్రదర్శనలకేఅంకితమైంది. ఆమే ముంబైకు చెందినసూఫీ గాయని స్మిత బెల్లూర్‌. తాజాగానగరంలోని ఆషియాన గార్డెన్స్‌లో ప్రదర్శన ఇచ్చారు. ‘సాక్షి’తో ఆమె ప్రత్యేకంగాముచ్చటించార సిటీబ్యూరో: నిజామ్‌ కాలంలో గజల్, సూఫీ సంగీతానికి నగరం కేంద్రంగా వర్ధిల్లిన సంగతి తెలిసిందే. ఆధునిక సంగీతపు ప్రవాహంలో ఆ అలనాటి సంగీతపు విశేషాలు అంతగా వినిపించనప్పటికీ... ఇప్పటికీ సంపన్నుల, సంప్రదాయ హైదరాబాదీల వేడుకల్లో గజల్‌ సవ్వడులు, çసూఫీ రాగాలు వీనుల విందు చేస్తూనే ఉంటాయి. అలాంటి వేడుకల కోసం ప్రముఖ గాయనీ గాయకులు నగరానికి రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. అదే క్రమంలో నగరానికి వచ్చిన  స్మిత బెల్లూర్‌ పంచుకున్న  విశేషాలు ఆమె మాటల్లోనే...